ఒడిశా నుంచి ఏపీకి గంజాయి స్మగ్లింగ్‌

ఒడిశా నుంచి ఏపీకి గంజాయి స్మగ్లింగ్‌

విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుమారు మూడు టన్నుల గంజాయిని స్వాధీనం చేసుకుని లారీని సీజ్‌ చేశారు. ఒడిశాలోని మల్కాన్‌గిరి నుంచి గంజాయిని ఏపీలోని తుని తరలిస్తున్నట్టు తమకు సమాచారం అందడంతో తనిఖీలు నిర్వహించామని సీఐ లక్ష్మణరావు తెలిపారు. తవుడు లారీలో గంజాయిని తరలిస్తున్నారని చెప్పారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.కోటిన్నర ఉంటుందని ఆయన అంచనా వేశారు.