నన్ను గెలిపించినందుకు ధన్యవాదాలు..

నన్ను గెలిపించినందుకు ధన్యవాదాలు..

రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీకి వ్యతిరేకంగా గాలులు వీచిన తనను గెలిపించిన గన్నవరం నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ధన్యవాదాలు తెలిపారు. గన్నవరం నుంచి తిరిగి గెలిచిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కొన్ని వర్గాలు తన ఓటమికై శ్రమించాయని అన్నారు. వారందరు ఏకమైనా.. తనను గెలిపించినందుకు ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు పని చేసిన దాని కంటే మెరుగ్గా పనిచేస్తానని హామీ ఇచ్చారు. స్థానికంగా ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను పేదలకు పంచడానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఓ కార్యాచరణపై ఈ ఐదు సంవత్సరాలు నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానని వల్లభనేని వంశీ తెలిపారు.