అంతా ఒట్టిదే.. విజయసాయి కామెంట్స్ కు గంటా రిప్లై !

అంతా ఒట్టిదే.. విజయసాయి కామెంట్స్ కు గంటా రిప్లై !

పార్టీలోకి రావడానికి పలు ప్రతిపాదనలు పంపారని వస్తున్న కామెంట్స్ మీద మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ స్పందించారు. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు మైండ్ గేమ్ లో భాగం అని నాకు పార్టీ మారే ఆలోచన లేదు అని ఆయన అన్నారు. 2019 నుంచి ఇప్పటి వరకు 100 సార్లు ప్రచారాలు జరిగాయని వెళ్ళాల్సి వస్తే ధైర్యంగా అందరికీ చెప్పే నిర్ణయం తీసుకుంటానని అన్నారు. మున్సిపల్ ఎన్నికలకు ఐదు రోజుల ముందు ఇలాంటి స్టేట్ మెంట్ ఎందుకు ఇచ్చారో ఆయనే చెప్పాలని అయన అన్నారు. ఈ స్పెక్యులేషన్ వెనుక ఉద్దేశం, లక్ష్యం ఉండి ఉండవచ్చు అని నేను ఎలాంటి ప్రతిపాదనలు,వివరాలు పంపించానో విజయసాయిరెడ్డి చెప్పాలని అన్నారు. 2019 తర్వాత జిల్లాలో నా అనుచరులు చాలా మంది పార్టీ మారారని, అంత మాత్రాన నేను వెళ్తాననేది కరెక్ట్ కాదని అన్నారు. నియోజకవర్గంలో అభ్యర్థుల గెలుపు పైనే నా దృష్టి ఉందని అన్నారు. వైసీపీలో చేరిన కాశీ విశ్వనాథ్ ఏడాది కాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నిబంధనల ప్రకారం నడుపుకుంటున్న వ్యాపారాలను దెబ్బతీసేందుకు ప్రయత్నించారని అందుకే ఆయన వైసీపీలో చేరారని అన్నారు.