'పవన్‌ వచ్చి పోటీ చేసినా నేనే గెలుస్తా..'

'పవన్‌ వచ్చి పోటీ చేసినా నేనే గెలుస్తా..'

'వివాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధిస్తా. జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ వచ్చి ఇక్కడ పోటీ చేసినా నాదే విజయం' అని అన్నారు ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు. ఇవాళ నామినేషన్‌ దాఖలు చేసిన అనంతరం గంటా మీడియాతో మాట్లాడారు. తన గెలుపుపై ఎలాంటి అనుమానం లేదన్నారు. ఎంత మెజారిటీ వస్తుందనే విషయమే ఆలోచించాలన్న గంటా.. గతంలో వచ్చిన మెజార్టీలను ఈసారి తిరగరాస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో టీడీపీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని గంటా అన్నారు.