గంటాకు సెంటిమెంట్‌ కలిసొచ్చేనా..?

గంటాకు సెంటిమెంట్‌ కలిసొచ్చేనా..?

మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఎట్టకేలకు నియోజకవర్గం ఖరారైంది. విశాఖపట్నం ఉత్తరం నుంచి ఆయన టీడీపీ తరఫున బరిలోకి దిగుతున్నారు. భీమిలి సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన.. ఈసారి విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తారని వార్తలొచ్చాయి. అనకాపల్లి ఎంపీగానైనా బరిలోకి దిగుతారని ప్రచారం జరిగింది. ఐతే.. ఆఖరికి విశాఖ ఉత్తర నియోజకవర్గం సీటు ఆయనకు ఖరారైంది. ప్రతిసారీ నియోజకవర్గాన్ని మార్చుకునే మంత్రి గంటా శ్రీనివాసరావు ఈసారీ ఆ సంప్రదాయాన్ని కొనసాగించారు. 2004లో టీడీపీ తరఫున చోడవరం నుంచి, 2009లో ప్రజారాజ్యం తరఫున అనకాపల్లి నుంచి పోటీ చేసి గెలుపొందిన గంటా.. 2014లో మళ్లీ టీడీపీ తరఫున భీమిలి నుంచి బరిలోకి దిగారు.