పార్టీ మార్పుపై గంటా క్లారిటీ..

పార్టీ మార్పుపై గంటా క్లారిటీ..

విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం నుంచి అతికష్టమ్మీద గెలిచిన మాజీ మంత్రి, టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారు. రాజకీయాల్లో ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని, చంద్రబాబు వెన్నంటే ఉంటానని స్పష్టం చేశారు. విశాఖపట్నంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు.  గెలిచినా, ఓడినా.. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల సంక్షేమానికి తనవంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు.