న్యూ ఇయర్ కానుకగా లక్ష్మిరాయ్ "గర్జన" టీజర్..
లక్ష్మీరాయ్ కొంత గ్యాప్ తర్వాత తమిళ, మలయాళ చిత్రాలపై ఆమె దృష్టి సారించింది. తాజాగా లక్ష్మీరాయ్ ‘గర్జన’ సినిమా చేస్తుంది. ఈ సినిమాలో లక్ష్మీ రాయ్ కి జోడిగా తమీళ నటుడు శ్రీకాంత్ నటించారు. అలాగే ముఖ్య పాత్రలో దెవ్ గిల్, నైరా, వైష్ణవి నటించారు. జె ప్రతిభన్ దర్శకత్వం వహించారు. మ్యూజిక్ అరుల్ దేవ్ అందించారు. ఎడిటర్ గా ఆర్.సుదర్శన్ పని చేశారు. ఆర్ట్ డైరెక్టర్ గా మిలన్ పనిచేశారు. ఈ చిత్రానికి పి.ఆర్.ఓ గా సురేశ్ కొండెటి చెయ్యడం విశేషం. ఈ చిత్రానికి బి వినోద్ జైన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి మోషన్ టీజర్ రిలీజ్ అయింది. ఈ టీజర్ కాస్త భయానకంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే.. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది. న్యూ ఇయర్ కానుకగా రేపు ఉదయం 8:30కి ఈ సినిమా టీజర్ రానుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్ను కూడా రిలీజ్ చేసింది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)