నా సలహా తర్వాతే కోహ్లీ మొదటి శతకం చేసాడు... 

నా సలహా తర్వాతే కోహ్లీ మొదటి శతకం చేసాడు... 

ప్రస్తుత భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ  2008 శ్రీలంకలో వన్డే సిరీస్తో జాతీయ జట్టులోకి అరంగేట్రం చేసాడు. అప్పుడు భారత జట్టుకు కిర్‌స్టన్ కోచ్‌గా వ్యవహరించాడు. అయితే మొదటిసారి ఈ  కాబోయే కెప్టెన్‌ను కలిసిన తరువాత తనకు ఎలా అనిపించిందో వెల్లడించాడు కిర్‌స్టన్. ఈ యువ క్రికెటర్ యొక్క నైపుణ్యాలు మరియు సామర్ధ్యం నన్ను బాగా ఆకట్టుకున్నాయి,కానీ బ్యాటింగ్ పరంగా అతను ఇంకా చాలా నేర్చుకోవలసి ఉంది అని కోహ్లీకి తాను నేర్పించిన విషయాలను వెల్లడించాడు.  కిర్‌స్టన్ మాట్లాడుతు... "మేము శ్రీలంకతో వన్డే సిరీస్ ఆడుతున్నప్పుడు జరిగిన ఘటన నేను ఎప్పటికీ మరచిపోలేను. అతను చాలా బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు మరియు మ్యాచ్ లో 30 నాట్ అవుట్ గా ఉన్నాడు. అప్పుడే అతను లాంగ్-ఆన్ లో సిక్స్ కొట్టాలని ప్రయత్నించి పెవిలియన్ కు వచ్చాడు.  అప్పుడు నేను అతనికి ''నువ్వు నీ ఆటని మరో స్థాయికి తీసుకెళ్లాలంటే.. బంతిని గాల్లోకి లేపకూడదు. బంతిని గ్రౌండ్‌ వెలుపలికి పంపే సామర్థ్యం నీలో ఉంది. కానీ.. ఆ షాట్‌ చాల రిస్క్‌తో కూడుకున్నది అని చెప్పా, ఆ తర్వాతి మ్యాచ్ లో అతను తన మొదటి శతకం చేసాడు” అంటూ కిర్‌స్టన్ గుర్తు చేసుకున్నాడు.  భారత జట్టుకు ప్రధాన కోచ్‌గా ఉన్న కిర్‌స్టన్ 3 సంవత్సరాల పదవీకాలం 2011 ప్రపంచ కప్ టైటిల్‌తో ముగిసింది.