సిలిండర్ పేలి ముగ్గురు మృతి

సిలిండర్ పేలి ముగ్గురు మృతి

వరంగల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. దామెర మండలం కంఠాత్మకూరులో ఆదివారం అర్ధరాత్రి గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు వ్యక్తులు సజీవ దహనం అయ్యారు. ఈ ప్రమాదంలో మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వ్యక్తిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ భారీ పేలుడుతో ఇల్లు మొత్తం కుప్పకూలింది. భారీ శబ్దంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసుల ప్రాథమిక విచారణలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుటుంబ కలహాల కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో మామిడి చిత్రసేన, లోగయ్య, రాజమ్మ, కుమారస్వామి ఉన్నారు. చిత్రసేన, లోగయ్య, రాజమ్మలు సజీవదహనం అవ్వగా.. కుమారస్వామి ఆసుపత్రిలో ఉన్నాడు.