భారత ఓటమి పూర్తిగా కెప్టెన్సీ వైఫల్యం...

భారత ఓటమి పూర్తిగా కెప్టెన్సీ వైఫల్యం...

ప్రస్తుత భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ కెప్టెన్సీ తనకు ఏం అర్థం కావడం లేదని... ఈఓటమి పూర్తిగా కెప్టెన్సీ వైఫల్యం అని భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అన్నాడు. ఆసీస్ తో వరుస ఓటములపై స్పందించిన గంభీర్.. విరాట్ కోహ్లీ కెప్టెన్సీ పై విమర్శలు గుప్పించాడు. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న ఆసీస్ అడ్డుకోవాలంటే ఆరంభంలోనే వికెట్లు తీయాలి. కానీ విరాట్ మాత్రం ప్రధాన బౌలర్లతో రెండు ఓవర్లను మాత్రమే వేయించాడు. మాములుగా వన్డేల్లో మూడు స్పెల్స్‌లో 4-3-3గా వేయిస్తారు. కానీ విరాట్ వ్యూహం ఏంటో నాకు అర్థం కాలేదు. ఆరంభంలో బుమ్రాతో కేవలం రెండు ఓవర్లు మాత్రమే వేయించాడు. ఇదేం కెప్టెన్సీనో ఏమో మరీ. ఆ కెప్టెన్సీ తీరును కూడా నేను విశ్లేషించలేకపోతున్నా. ఇదేం టీ20 క్రికెట్ కాదు. అలా ఎందుకు చేశాడో కూడా అర్థం కావడం లేదు. ఇది అత్యంత చెత్త కెప్టెన్సీ అని గంభీర్ పేర్కొన్నాడు.