రాజకీయాల్లోకి గౌతం గంభీర్‌?

రాజకీయాల్లోకి గౌతం గంభీర్‌?

క్రికెటర్లు రాజకీయాల్లోకి రావడం కొత్తేమీ కాదు. తాజాగా మరో భారత క్రికెటర్‌ ఈ రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడంటూ వార్తలొస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో పశ్చిమ ఢిల్లీ నుంచి గంభీర్‌ బరిలోకి దిగుతాడని పుకార్లు షికారు చేస్తున్నాయి. పశ్చిమ ఢిల్లీ నుంచి బీజేపీ తరఫున గంభీర్‌ బరిలోకి దిగుడుతాడని ఓ జాతీయ పత్రిక కథనం ప్రచురించింది. ఢిల్లీకి చెందిన ఓ బీజేపీ నేత ఈ విషయం చెప్పారని తెలిపింది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ కొత్త వారికి టిక్కెట్లు ఇచ్చి వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలవాలని భావిస్తోందని.. ఇందులో భాగంగా గంభీర్‌ను పోటీలోకి దింపాలని యోచిస్తున్నట్టు అందులో పేర్కొంది.