పద్మశ్రీ అందుకున్న గౌతమ్ గంభీర్‌

పద్మశ్రీ అందుకున్న గౌతమ్ గంభీర్‌

ఈ సంవత్సరం పద్మ అవార్డుల ప్రదానోత్సవం రాష్ట్రపతి భవన్‌లో ఘనంగా జరిగింది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పద్మ అవార్డు గ్రహీతలకు అవార్డులను ప్రదానం చేశారు. టీమిండియా మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. భారత ఫుట్‌బాల్‌ జట్టు కెప్టెన్‌ సునిల్‌ ఛెత్రి కూడా పద్మశ్రీ అందుకున్నారు. ఒడిశాకు చెందిన ఛాయ్‌వాలా డీ ప్ర‌కాశ్ రావు ప‌ద్మ‌శ్రీ అవార్డును అందుకున్నారు. జాన‌ప‌ద గాయ‌ని తీజ‌న్ భాయ్‌ ప‌ద్మ విభూష‌ణ్ అవార్డును అందుకున్నారు. ఇస్రో శాస్త్ర‌వేత్త నంబి నారాయ‌ణ్‌, వాణిజ్య‌వేత్త మ‌హ‌స్య ధ‌ర్మ‌పాల గులాటీ, ప‌ర్వ‌తారోహ‌కురాలు బ‌చేంద్రి పాల్‌లు ప‌ద్మ భూష‌ణ్ అందుకున్నారు.

హీరో మ‌నోజ్ బాజ్‌పాయి, త‌బ‌లా ఆర్టిస్ట్ స‌ప్నా చౌద‌రీ, ఆర్చ‌రీ క్రీడాకారిణి బంబేలా దేవి, ప‌బ్లిక్ అఫైర్స్‌లో హెచ్ ఎస్ ఫూల్కా, బాస్కెట్‌బాల్ ప్లేయ‌ర్ ప్ర‌శాంతి సింగ్‌లు ప‌ద్మ‌శ్రీ అవార్డును అందుకున్నారు.  2019 పద్మ పురస్కారాలకు మొత్తం 112 మంది ఎంపికయ్యారు. 47 మందికి ఈ నెల 11న అవార్డులను అందజేయగా.. మిగతావారికి ఈ రోజు ప్రదానం అందజేశారు.