మహ్మద్ నబీ ఈ ఏడాది కూడా బెంచ్‌కే...

మహ్మద్ నబీ ఈ ఏడాది కూడా బెంచ్‌కే...

ఆఫ్ఘనిస్తాన్ ఆల్ ‌రౌండర్ మహ్మద్ నబీ ఈ ఏడాది కూడా బెంచ్‌కే పరిమితం అయ్యేలా కనిపిస్తున్నాడు అని భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అన్నాడు. అయితే నబీ ఐపీఎల్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇక గత ఏడాది ఎక్కువ మ్యాచ్లు బెంచ్ పైనే ఉన్న నబీకి ఈ ఏడాది కూడా అదే పరిస్థితి ఎదురవుతుంది అని గంభీర్ అన్నాడు. నబీ ఐసీసీ టీ 20 ఆల్ ‌రౌండర్ల జాబితాలో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. అంతే కాకుండా ఈ ఏడాది జరిగిన కరేబియన్ లీగ్ లో 12 మ్యాచ్‌లాడిన నబీ.. 156 పరుగులు అలాగే 12 వికెట్లు పడగొట్టాడు. కానీ ఐపీఎల్ లో మాత్రం సన్‌రైజర్స్ జట్టులో అతనికి చోటు దక్కడం లేదు. దానికి కారణం కూడా ఉంది. అదేంటంటే... ఐపీఎల్ తుది జట్టులో కేవలం నలుగురు మాత్రమే విదేశీ ఆటగాళ్లు ఉండాలి. అయితే సన్‌రైజర్స్ లో ఇప్పటికే కెప్టెన్ డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, జానీ బెయిర్‌స్టో, రషీద్ ఖాన్ ముఖ్యమైన ఆటగాళ్లుగా కొనసాగుతున్నారు. దాంతో నబీకి తుది జట్టులో చోటు దక్కడం లేదు. ఒకవేళ అతను సన్‌రైజర్స్ లో కాకుండా మారె ఇతర జట్టులో ఉన్న రెగ్యులర్ ఆటగాడిగా ఆ జట్టులో కొనసాగేవాడు అని గౌతమ్ గంభీర్ వెల్లడించాడు.