ధోని ఎటువంటి మ్యాచ్ విజేతలను అందించలేదు : గంభీర్

ధోని ఎటువంటి మ్యాచ్ విజేతలను అందించలేదు : గంభీర్

మాజీ ఓపెనర్, ప్రస్తుత బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ భారత జట్టుకు సౌరవ్ గంగూలీ కెప్టెన్ గా ఉన్నప్పుడు ఎంతో  మంది మ్యాచ్ విన్నర్లను అందించాడు కానీ ఎంఎస్ ధోని మాత్రం జట్టుకు తగినంత నాణ్యమైన ఆటగాళ్లను ఇవ్వలేదు అని అన్నారు.  గంభీర్ మాట్లాడుతూ.. ఎంఎస్ ధోని తన కెప్టెన్సీ లో చాలా మంది మ్యాచ్ విజేతలను సృష్టించలేదని, సౌరవ్ గంగూలీ తన పాలనలో అద్భుతమైన ఆటగాళ్లను జట్టుకు అందించాడని అన్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మరియు జస్‌ప్రీత్ బుమ్రా మినహా, ఎంఎస్ ధోని కెప్టెన్‌గా ఉన్న కాలంలో ఎవరు అద్భుతమైన ఆటగాళ్లు లేరు అని గంభీర్ తెలిపాడు. ఇక 2007 లో ప్రపంచ కప్ విజేతగా నిలిచిన ధోని జట్టులో, యువరాజ్ సింగ్, వీరేందర్ సెహ్వాగ్, హర్భజన్ సింగ్ మరియు జహీర్ ఖాన్ వంటి గంగూలీ అందించిన ఆటగాళ్లతో చాలా మంచి జట్టును కలిగి ఉన్నారని గంభీర్ అభిప్రాయపడ్డారు. "అయితే సౌరవ్ గంగూలీ భారత క్రికెట్‌కు అందించిన వారిలో యువరాజ్ సింగ్, ధోని గెలిచినా రెండు ప్రపంచ కప్‌లలో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు. ఇక దాదా కష్టంతో ధోని చాలా ట్రోఫీలు గెలుచుకున్నాడు అని తెలిపాడు.