కష్టం దాదాది .. ప్రతిఫలం ధోనిది : గంభీర్

కష్టం దాదాది .. ప్రతిఫలం ధోనిది : గంభీర్

మాజీ భారత ఓపెనర్ గౌతమ్ గంభీర్ తన కెప్టెన్సీలో ప్రపంచంలోనే అత్యుత్తమ జట్టును కలిగి ఉన్నందున ఎంఎస్ ధోనిని "అదృష్టవంతుడు" అని పిలిచాడు. టెస్ట్ కెప్టెన్‌గా ఎంఎస్ ధోని సాధించిన ఘనత జహీర్ ఖాన్‌కు మాత్రమే దక్కాలని,  కపిల్ దేవ్ తర్వాత టెస్ట్ ఫార్మాట్‌లో భారత్‌కు అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాడు జహీర్ ఖాన్‌ మాత్రమే అని గుర్తుచేశారు. అయితే జహీర్ ఖాన్ లాంటి ఆటగాడిని జట్టులోకి తీసుకువచ్చినందుకు టెస్ట్ లో ధోని సాధించిన క్రెడిట్ మొత్తం భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి ఇవ్వాలని గంభీర్ అభిప్రాయపడ్డారు.

నా ప్రకారం ధోని చాలా  అదృష్టవంతుడు ఎందుకంటే... దాదా కారణంగా అతను ప్రతి ఫార్మాట్‌లో అద్భుతమైన జట్టును పొందాడు" అని గౌతమ్ గంభీర్ అన్నారు. తన 14 సంవత్సరాల టెస్ట్ కెరీర్‌లో జహీర్ ఖాన్ 311 వికెట్లు పడగొట్టాడు. అందులో...  ధోని కెప్టెన్సీలో 116 వికెట్లు సాధించగా, సౌరవ్ గంగూలీ న్యాయకత్వంలో 102 వికెట్లు పడగొట్టాడు. అలాగే సచిన్ టెండూల్కర్, వీరేందర్ సెహ్వాగ్, మునాఫ్ పటేల్, యువరాజ్ సింగ్, యూసుఫ్ పఠాన్, విరాట్ కోహ్లీ వంటి దాదా ఆటగాళ్ళు జట్టులో ఉన్నందునే ధోని 2011 ప్రపంచ కప్ విజేత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం కష్టమేమీ కాదని అతను "లక్కీ కెప్టెన్" అని గౌతమ్ గంభీర్ అన్నారు.