తూర్పు ఢిల్లీ బీజేపీ అభ్యర్థిగా గౌతమ్ గంభీర్

తూర్పు ఢిల్లీ బీజేపీ అభ్యర్థిగా గౌతమ్ గంభీర్

తూర్పు ఢిల్లీ పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్థిగా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ను బీజేపీ బరిలోకి దింపింది. 37 ఏళ్ల క్రికెటర్ సిట్టింగ్ ఎంపీ మహేష్ గిరి స్థానంలో పోటీ చేయనున్నాడు. అతను కాంగ్రెస్ అభ్యర్థి అర్విందర్ సింగ్ లవ్లీ, ఆమ్ ఆద్మీ పార్టీ ఆతిషీతో తలపడతాడు. 

ప్రస్తుతం ఎంపీగా ఉన్న మీనాక్షి లేఖి మరోసారి న్యూఢిల్లీ నుంచి పోటీ చేస్తారు. ఆమె ఆప్ కి చెందిన బ్రజేష్ గోయల్, కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ మాకెన్ లను ఢీ కొంటారు. దేశ రాజధానిలోని ఏడు సీట్లకు మే 12న ఎన్నికలు జరుగుతాయి. ఢిల్లీ సీట్లకు నామినేషన్లు వేయడానికి చివరి రోజు మంగళవారం. బీజేపీ, కాంగ్రెస్ ఇప్పటికీ ఒక్కో స్థానానికి అభ్యర్థులను ప్రకటించలేదు.

ఇవాళ కాంగ్రెస్ ఢిల్లీ ఎన్నికలకు ఆరుగురు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. న్యూఢిల్లీ సీటులో కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ మాకెన్, లేఖీ తలపడనున్నారు. బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు మనోజ్ తివారీ, కాంగ్రెస్ ఢిల్లీ అధ్యక్షురాలు షీలా దీక్షిత్ ను ఢీ కొంటారు. 

ఇవాళ ఉదయం తివారీ, కేంద్ర మంత్రి హర్షవర్ధన్, సిట్టింగ్ బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ వరుసగా చాందినీ చౌక్, ఈశాన్య ఢిల్లీ, పశ్చిమ ఢిల్లీ నియోజకవర్గాల నుంచి నామినేషన్లు దాఖలు చేశారు. సిట్టింగ్ దక్షిణ ఢిల్లీ ఎంపీ రమేష్ బిధూరీ మంగళవారం నామినేషన్ వేస్తారు. వాయవ్య ఢిల్లీ సీటుకి బీజేపీ ఇంకా అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది.

కాంగ్రెస్ నుంచి అర్విందర్ సింగ్ లవ్లీ తూర్పు ఢిల్లీ నుంచి, జేపీ అగర్వాల్ చాందినీ చౌక్ నుంచి, రాజేష్ లిలోథియా ఈశాన్య ఢిల్లీ నుంచి, మహాబల్ మిశ్రా పశ్చిమ ఢిల్లీ నుంచి పోటీ చేస్తారు.