నీలా బ్యాటింగ్ చేయాలని ఉండేది ఛాంపియన్..

నీలా బ్యాటింగ్ చేయాలని ఉండేది ఛాంపియన్..

అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతూ టీమిండియా క్రికెటర్ యువరాజ్ సింగ్ సంచనల నిర్ణయం తీసుకున్నాడు.. దీనిపై స్పందించిన టీమిండియా మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్.. యువీ రిటైర్మెంట్‌పై సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. 'అద్భుతమైన కెరీర్‌కు శుభాభినందనలు ప్రిన్స్.. భారత వన్డే క్రికెట్‌లో నువ్వు అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌వి... యూవీ సేవలకుగానూ జెర్సీ నెంబర్ 12కి కూడా బీసీసీఐ రిటైర్మెంట్ ప్రకటించాలి.. నీలా బ్యాటింగ్ చేయాలని ఉండేది ఛాంపియన్' అంటూ ట్వీట్ చేశారు గౌతం గంభీర్. కాగా, అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన యువరాజ్ సింగ్.. క్యాన్సర్ పేషంట్స్ కి సాయం చేయడం నా తదుపరి లక్ష్యమని ప్రకటించారు. నాలాగే క్యాన్సర్ తో ఎవరూ బాధ పడొద్దు అన్నదే నా ఆశ.. కొన్ని ఎన్జీవోలతో టైఅప్ అయ్యాం... క్యాన్సర్ బాధితులకు అండగా ఉంటానని ప్రకటించిన సంగతి తెలిసిందే.