హీరోకి తండ్రిగా గౌతమ్ మీనన్ ?

హీరోకి తండ్రిగా గౌతమ్ మీనన్ ?

 

'అర్జున్ రెడ్డి' చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.  తొలుత ఈ ప్రాజెక్టును దర్శకుడు బాల డీల్ చేశాడు.  కానీ ఔట్ ఫుట్ సరిగా రాకపోవడంతో ఆయన ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు.  ఇప్పుడు ఆ సినిమాను మళ్ళీ మొదటి నుండి తీస్తున్నారు.  తెలుగు వెర్షన్ కు డైరెక్షన్ డిపార్మెంట్లో పనిచేసిన గిరీశయ్య దర్శకుడు.  తాజా సమాచారం మేరకు ఇందులో హీరో తండ్రిగా స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ నటిస్తారని తెలుస్తోంది.  తెలుగులో ఈ పాత్రను మహేష్ బాబు బావమరిది సంజయ్ స్వరూప్ చేయడం జరిగింది.