కోహ్లీ లేని మ్యాచ్ లే విజయం సాధించాం...

కోహ్లీ లేని మ్యాచ్ లే విజయం సాధించాం...

ప్రస్తుతం భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. అయితే ఇందులో భాగంగా డిసెంబర్ 17 నుంచి ప్రారంభమయ్యే తొలి టెస్ట్ తర్వాత విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా నుంచి భారత్ కు వచ్చేస్తాడు . అప్పుడు జట్టులోని సీనియర్ ఆటగాళ్ళు చేతేశ్వర్ పుజారా, అజింక్య రహానె జట్టుకోసం పరుగులు చేసే బాధ్యతను స్వీకరించాలని భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ కోరుకుంటున్నారు. అయితే కోహ్లీ జట్టులో లేని చాలా మ్యాచ్ లలో భారత్ విజయం సాధించింది అని గవాస్కర్ అన్నారు. అయితే విరాట్ లేనప్పుడే భారత ఆటగాళ్లు అందరూ బాగా ఆడటానికి ప్రయత్నిస్తారు. అతను లేని లోటు తీర్చాలని చూస్తారు అని గవాస్కర్ తెలిపారు. అయితే కోహ్లీ లేన్నపుడు టెస్ట్ వైస్ కెప్టెన్ రహానె మిగిలిన మూడు మ్యాచ్‌లలో భారత జట్టుకు నాయకత్వం వహిస్తాడు అని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఈ సిరీస్ రహానే మరియు చేతేశ్వర్ పుజారాకు కఠినంగా ఉంటుంది. ఈ ఇద్దరు ఆటగాళ్ళు తమ అనుభవాన్ని మొత్తం అక్కడ చూపించాల్సి ఉంటుంది. పుజారా ను స్వేచ్ఛగా వదిలేస్తే అతను అద్భుతంగా రాణిస్తాడు. ఇక రహానే పైన కెప్టెన్సీ భారం భారీగానే ఉంటుంది అని గవాస్కర్ అన్నాడు.