'బిగ్‌బాస్‌' వల్ల నా కెరీర్‌ నాశనం...

'బిగ్‌బాస్‌' వల్ల నా కెరీర్‌ నాశనం...

బిగ్ బాస్ రియాలిటీ షో తొలి సీజన్‌ నుంచే వివాదాస్పదం. ఇంకా చెప్పాలంటే వివాదాలే ప్రధానాంశంగా చేసుకుని ఈ షోను నడిపించారు. గత సీజన్‌లోనైతే సెలక్షన్స్‌ నుంచి విన్నర్‌ వరకు ప్రతి అంశమూ వివాదంగానే మారింది. త్వరలోనే మూడో సీజన్‌ ప్రారంభమవబోతుండగా.. అప్పుడే ఆరోపణలు.. కేసులతో సంచలనంగా మారింది. ఈ షోలో పాల్గొనాలని భావించి తన ఆసక్తిని తెలియజేసిన వర్ధమాన నటి గాయత్రి గుప్తా.. ఇప్పుడు ఈ రియాలిటీ షో నిర్వాహకులపైన తీవ్ర ఆరోపణలు చేస్తోంది. రఘు, రవికాంత్ అనే ఇద్దరు కార్యక్రమ నిర్వహకులు తనను కలిసి  బిగ్‌బాస్‌ షోలో పాల్గొనాలని అడిగారని.. తాను ఆసక్తి చూపించాక రెండు నెలలపాటు వెయిట్‌ చేయించి తిరస్కరించారని చెప్పింది. అగ్రిమెంట్‌ కూడా పూర్తియిందని చెబతూనే అసభ్యకర ప్రశ్నలు వేశారని ఆరోపించింది. బిగ్‌ బాస్‌ షోలో అవకాశం వస్తుందని భావించిన తాను.. ఆరేడు సినిమాల అవకాశాలను వదిలేసుకున్నానని చెప్పింది గాయత్రి. ఈ వ్యవహారంపై ఆమె 'ఎన్టీవీ'తో ప్రత్యేకంగా మాట్లాడింది. ఆ ఇంటర్వ్యూ కోసం కింది వీడియోను క్లిక్‌ చేయండి..