అదరగొట్టిన జీడీపీ వృద్ధి రేటు

అదరగొట్టిన జీడీపీ వృద్ధి రేటు

వరుస ప్రతికూల వార్తలతో తల్లడిల్లిపోతున్న ఎన్డీఏ ప్రభుత్వానికి సంతోషం కలిగించే వార్త.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు 8.2 శాతానికి చేరింది. ఇది రెండేళ్ళలో గరిష్ఠ స్థాయి. అంత క్రితం త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 7.7 శాతం కాగా, ఏత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో జీడీపీ వృద్ధిరేటు 5.59 శాతంగా నమోదైంది. కీలక రంగాలు బాగా రాణించడంతో జీడీపీ వృద్ధిరేటు సూపర్‌ జెట్‌ స్పీడుతో ముందుకు సాగింది.  తొలి త్రైమాసికంలో వ్యవసాయ వృద్ధి రేటు 4.5 శాతం నుంచి 5.3 శాతానికి పెరగ్గా, మాన్యుఫ్యాక్చరింగ్‌ రంగం వృద్ధిరేటు 9.1 శాతం నుంచి ఏకంగా 13.5 శాతానికి పెరిగిందని ప్రభుత్వం పేర్కొంది. కాని నిర్మాణ రంగ వృద్ధి రేటు మాత్రం 11.5 శాతం నుంచి 8.7 శాతానికి క్షీణించింది. ఫైనాన్స్‌ రంగం 5 శాతం నుంచి 6.5 శాతం చొప్పున పెరగ్గా, మైనింగ్ రంగ వృద్ధి రేటు మాత్రం 2.7 శాతం నుంచి 0.1 శాతానికి పడిపోయింది.