ఆర్ఎక్స్ 100 లాగే.. గీత గోవిందం అలా చేస్తుందేమో..?

ఆర్ఎక్స్ 100 లాగే.. గీత గోవిందం అలా చేస్తుందేమో..?

ఈ ఏడాది చిన్న సినిమాగా వచ్చిన ఆర్ ఎక్స్ 100 లాంగ్ రన్ లో నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది. మూడు కోట్ల రూపాయలతో తెరకెక్కిన ఈ సినిమా దాదాపు రూ.14 కోట్ల వరకు వసూళ్లు సాధించింది.   పెట్టిన దానికి నాలుగు రేట్లు లాభాలు తీసుకొచ్చింది.  ఇదిలా ఉంటె, ఇప్పుడు గీత గోవిందం కూడా ఇదే బాటలో నడుస్తున్నది.  గీత గోవిందం బడ్జెట్ రూ.15 కోట్లు.  ఇప్పటికే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.25 కోట్లు వసూలు చేసింది.  ఈ వీకెండ్ లో భారీ సినిమాలు ఏవీ లేకపోవడంతో.. గీత గోవిందంకు కలెక్షన్లు వరదలా వస్తాయి అనడంలో సందేహం లేదు.  

యూఎస్ లో ఇప్పటికే రూ.6 కోట్ల రూపాయలు వసూలు చేసింది.  ఈ వీకెండ్ పూర్తయ్యే సరికి 10 కోట్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు.  లాంగ్ రన్ లో గీత గోవిందానికి పెట్టిన బడ్జెట్ రూ.15 కోట్లు యూఎస్ కలెక్షన్ల రూపంలో వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.