హిందీ సినిమాలకు తలనొప్పిగా మారిన 'గీత గోవిందం' !

హిందీ సినిమాలకు తలనొప్పిగా మారిన 'గీత గోవిందం' !

ఒకప్పుడు ఓవర్సీస్ వసూళ్లు అంటే బాలీవుడ్ సినిమాల గురించే చెప్పుకునేవాళ్ళు.  కానీ ఇప్పడు పరిస్థితి పూర్తిగా మారింది.  విదేశాల్లో తెలుగు సినిమాల హవా బాగా పెరిగింది.  అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో అయితే టాలీవుడ్ సినిమా డామినేషన్ చాలా ఎక్కువగా ఉంది. 

అందుకు బెస్ట్ ఉదాహరణ ఈ వారం సినిమాలే.  ఆస్ట్రేలియా బాక్సాఫీస్ వద్ద ఈ వారం 'గోల్డ్, సత్యమేవజయతే' లాంటి హిందీ సినిమాలు విజయవంతగా నడుస్తుండగా గత వారమే విడుదలైన విజయ్ దేవరకొండ, రష్మికల 'గీత గోవిందం' వాటికి పోటీగా మారింది.  ఈ  హిందీ సినిమాలు కలిసి 192,306 ఆస్ట్రేలియన్ డాలర్లను కలెక్ట్ చేయగా 'గీత గోవిందం' మాత్రం సోలోగా 202,266 ఆస్ట్రేలియన్ డాలర్లను సాధించి సత్తా చాటింది.