మహర్షి శాటిలైట్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ ఛానల్

మహర్షి శాటిలైట్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ ఛానల్

మహేష్ బాబు మహర్షి సినిమా షూటింగ్ దశలో ఉన్నది.  ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ యూఎస్ లో జరుగుతున్నది.  మహేష్ బాబు యూఎస్ షెడ్యూల్ లో త్వరలో పాల్గొనబోతున్నారు.  తన ఫ్యామిలీతో కలిసి మహేష్ జర్మనీలో ఉన్న సంగతి తెలిసిందే.  జర్మనీ నుంచి తిరిగి రాగానే మహేష్ బాబు యూఎస్ షెడ్యూల్ లో పాల్గొంటారు.  ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ బయటకు వచ్చింది.  

మహేష్ బాబు సినిమాలకు శాటిలైట్ రైట్స్ ఎప్పుడు భారీగానే అమ్ముడుపోతుంటాయి.  మహేష్ 25 వ సినిమా  కావడంతో ఈ సినిమాకు  డిమాండ్ ఎక్కువగా ఉంది.  ఈ పోటీలో నిలబడి జెమిని టెలివిజన్ సంస్థ శాటిలైట్ హక్కులను సొంతం చేసుకుంది.  ఇందుకోసం భారీ మొత్తాన్నే వెచ్చించినట్టు తెలుస్తున్నది.