ఇంకా లోపలి పోలేపోతున్నాం : జెన్కో సీఎండీ !

ఇంకా లోపలి పోలేపోతున్నాం : జెన్కో సీఎండీ !

శ్రీశైలం ఘటన చాలా దురదృష్టకరమని ట్రాన్స్ కో జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు అన్నారు. 7 ఇంజనీర్ లు,ఇద్దరు ఇతర వ్యక్తులు చనిపోవడం బాధాకరమని సంఘటన జరిగిన కొన్ని గంటల్లోనే అక్కడకు నేను మంత్రి చేరుకున్నామని అన్నారు. వాళ్ళను కాపాడడం కోసం అనేక ప్రయత్నాలు చేశామని రాత్రి మొత్తము రెస్క్యూ ఆపరేషన్ చేశాం కానీ అది వర్కౌట్ కాలేదని దీంతో వెంటనే ఎన్డి ఆర్ ఎఫ్ ,సి ఐ ఎస్ ఎఫ్ బృందాలను పిలిచామని అన్నారు. మొత్తము పవర్ పోవడంతో లోపల అంధకారం అలుముకుందని స్మోక్ తో ఆక్సిజన్ లభించలేదని అన్నారు.

చాలా ప్రయత్నాలు చేశామని స్మోక్ ను బయటకు పంపించేందుకు చాలా కష్టపడ్డా దురదృష్టవశాత్తు వారు చనిపోయారని అన్నారు. ఎందుకు ఇలాంటి సమస్య వచ్చిందో తెలుసుకోవడానికి ప్రయతిస్తున్నామని పవర్ పోవడం తో వెంటిలేషన్ ఆగిపోయిందని అందుకే ఎమర్జన్సీవే కూడా తెరుచుకోలేదని అన్నారు. తమ మీద వస్తున్న ఆరోపణలు అవాస్తవమని అన్నారు. బయట నుండి ఎలాంటి వాటర్ లోపలికి వచ్చే ఛాన్స్ లేదని, ప్లాంట్ లోపలికి నీరు వచ్చేది లేదు ,ఎలాంటి ఇబ్బంది కూడా లేదని అన్నారు. సిఐడి వాళ్ళ పని వాళ్ళు చేసి రిపోర్ట్ ఇస్తారని మేము కూడా ఇంటర్నల్ కమిటీ వేశామని అన్నారు. ఇంకా లోపలికి పోవడానికి వీలు లేదన్న ఆయన ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు.