స్టాలిన్‌కు సోనియా నుంచి ఆహ్వానం

స్టాలిన్‌కు సోనియా నుంచి ఆహ్వానం

ఈ నెల 23న ఢిల్లీలో జరగనున్న ప్రతిపక్షాల భేటీకి హాజరుకావాలని డీఎంకే అధినేత స్టాలిన్‌కు యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ పిలుపు నిచ్చారు. ప్రధాని మోడీ నాయకత్వంలోని ఎన్డీయేను నిలువరించేందుకు.. విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందులో భాగంగా భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు ఈనెల 23న సోనియా అధ్యక్షతన సమావేశం నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ సమావేశానికి యూపీయే భాగస్వామ్య పక్షాలతోపాటు తటస్థ పార్టీలను సోనియా ఆహ్వానించారు. హంగ్‌ ప్రభుత్వం తప్పదన్న సర్వేలతో సోనియా గాంధీ నిర్వహించనున్న ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.