ఓటు వేసిన భారత తొలి ఓటరు 'శ్యామ్ శరణ్ నేగి'

ఓటు వేసిన భారత తొలి ఓటరు 'శ్యామ్ శరణ్ నేగి'

లోక్ సభ ఎన్నికల 7వ విడతలో భాగంగా ఈ రోజు భారత దేశ తొలి ఓటరు 103 ఏళ్ల శ్యామ్ శరణ్ నేగి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. భావితరాలకు ఓటు హక్కు విలువ గురించి తెలిపారు. హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లా కల్పకు చెందిన శ్యామ్ శరణ్ నేగికి ఎన్నికల సంఘం అధికారులు రెడ్ కార్పెట్ వేసి ఘనస్వాగతం పలికారు. సకల మర్యాదలతో ఆయనను పోలింగ్ బూత్‌లోకి తీసుకెళ్లి దగ్గరుండి వేలికి ఇంకు సిరా పూసి, ఈవీఎం వద్దకు తీసుకెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకునేలా చేశారు.