మా భార్యలతో ఉన్నపుడు కూడా మోగుతుందా...?

మా భార్యలతో ఉన్నపుడు కూడా మోగుతుందా...?

ఐపీఎల్ 2020 కోసం దుబాయ్ కి వెళ్లిన ఆటగాళ్లు అందరూ ప్రస్తుతం తమ క్వారంటైన్ ముగించుకొని ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే అక్కడి విషయాలను ఢిల్లీ క్యాపిటల్స్‌ సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ తన యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా అభిమానులతో పంచుకుంటున్నాడు. అలా చేసిన ఓ వీడియోలో ఒక ఫన్నీ విషయాన్ని బయటపెట్టాడు. మేము గది దాటితే జియో ట్యాగింగ్‌ పరికరం మా దగ్గర ఉండాలి. అది ఏం చేస్తుందంటే.. ఆటగాళ్ళు దగ్గరగా వెళుతున్నప్పుడు మమ్మల్ని అలర్ట్ చేస్తోంది. వెంటనే ఆ పరికరం నుండి ఓ గంట కూడా మోగుతుంది. ఇక్కడ మమల్ని అధికారులు ఇంతటి కఠిన నిబంధనల మధ్య మమ్మల్ని ఉంచుతున్నారు. అయితే అంతకుముందు మాకు దీని గురించి జూమ్‌ కాల్‌లో వివరించారు. అప్పుడు ఓ ఆటగాడు ఓ ప్రశ్న అడిగాడు. అదేంటంటే... ''అక్కడ బయోబుల్ లోకి వచ్చిన మా భార్యలు కూడా ఈ పరికరం వాడాల్సిందేనా అని ప్రశ్నించాడు. దానికి అవును అని అధికారులు తెలిపారు. మరి ఆటగాళ్ళము మా భార్యలతో గదిలో కలిసే ఉంటాము కదా! అప్పుడు కూడా ఈ గంట మోగుతుందా అని అన్నాడు.'' దానికి అందరూ గట్టిగ నవ్వుకున్నారు అని అశ్విన్‌ తెలిపాడు.