2022లో జార్జ్ క్లూనీ, జూలియా రాబర్ట్స్ 'టికెట్ టు ప్యారడైజ్'

2022లో జార్జ్ క్లూనీ, జూలియా రాబర్ట్స్ 'టికెట్ టు ప్యారడైజ్'

ప్రెస్టేజియస్ బ్యానర్ యూనివరల్స్ పిక్చర్స్ నిర్మిస్తోన్న లేటెస్ట్ రొమాంటిక్ కామెడి 'టికెట్ టు ప్యారడైజ్' 2022, సెప్టెంబర్ 30న విడుదల కానుంది. జూలియా రాబర్ట్స్, జార్జ్ క్లూనీ లీడ్ కపుల్ గా నటిస్తున్నారు. బిల్లీ లౌర్డ్ కూడా ఒక ప్రధాన పాత్రలో కనిపించబోయే 'టికెట్ టు ప్యారడైజ్' మూవీలో విడాకులు తీసుకున్న ఓ జంట కథ చూపించబోతున్నారు. జార్జ్ క్లూనీ, జూలియా రాబర్ట్స్ తమ కూతురి కోసం మరోసారి ఒక్కటవుతారు. ప్రేమలో పడి పెళ్లికి సిద్ధమైన ఆమెని సీనియర్ కపుల్ ఎలా ఆపరన్నదే స్టోరీ! తాము పాతికేళ్ల కిందట చేసిన తప్పే తమ కూతురు మళ్లీ చేయవద్దని వారి తాపత్రయం... 'మామా మియా', 'హియర్ వి గో' లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన ఓఎల్ పార్కర్ 'టికెట్ టు ప్యారడైజ్' డైరెక్ట్ చేయనున్నాడు. అతనితో పాటూ డేనియల్ పిప్ స్కీ సహ రచయితగా వ్యవహారించాడు. జార్జ్ క్లూనీ, జూలియా రాబర్ట్స్ 'టికెట్ టు ప్యారడైజ్'కు నిర్మాతలుగానూ వ్యవహారించటం విశేషం!