ఫిఫా: జర్మనీకి షాక్

ఫిఫా: జర్మనీకి షాక్

ఫిఫాలో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన జర్మనీ.. టోర్నీ నుంచి వైదొలిగింది. గ్రూప్‌-ఎఫ్‌ మ్యాచ్‌లో 0-2 తేడాతో కొరియా చేతిలో మట్టికరిచింది. ఈ  ఓటమితో  గ్రూప్‌-ఎఫ్‌లో జర్మనీ.. పాయింట్ల పట్టికలో చివరి స్థానానికి దిగజారింది. ఈ మ్యాచ్‌లో ఎక్కువ భాగం బంతి జర్మనీ జట్టు నియంత్రణలో ఉన్నా ఆ జట్టు గోల్‌ సాధించలేకపోయింది. జర్మనీ చేసిన 26 గోల్‌ ప్రయత్నాలు నిష్ఫలమయ్యాయి. లక్ష్యంపైనే ఆరు సార్లు దాడి చేసినా నిరాశే ఎదురైంది. అదనపు సమయంలో రెండు గోల్స్‌ చేసిన దక్షిణకొరియా సంచలన విజయం సాధించింది. ఇంజ్యూరీ టైమ్‌లో కొరియా స్ట్రయికర్లు  రెండు గోల్స్‌(90+3వ నిమిషంలో వైజి కిమ్‌), (90+6వ నిమిషంలో హెచ్‌ఎం సన్‌)  కొట్టి చిరకాల విజయాన్ని అందుకున్నారు.  గోల్స్‌ను నిరోధించడంలో ప్రతిభ చూపిన కొరియా కీపర్‌ జేవో హియాన్‌వూకు 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు దక్కడం విశేషం.