బంపర్ ఆఫర్: పెట్రోల్ పోయించుకుంటే బిర్యానీ ఫ్రీ... షరతులు వర్తిస్తాయి...!!

బంపర్ ఆఫర్: పెట్రోల్ పోయించుకుంటే బిర్యానీ ఫ్రీ... షరతులు వర్తిస్తాయి...!!

ఫ్రీ అంటే మనం ఏదైనా కొనుగోలు చేస్తాం.  వినియోగదారుల నాడిని గుర్తించిన వ్యాపారవేత్తలు వివిధ రకాల ఆఫర్లతో ముందుకు వస్తున్నారు.  ఇలానే బెంగుళూరులోని శ్రీవెంకటేశ్వర ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పెట్రోల్ బంక్ ఓ వినూత్న అఫర్ ను ప్రకటించింది.  తమ స్టేషన్ లో పెట్రోల్ కొట్టించుకున్న వారికి బిర్యానీని ఫ్రీగా అందించేందుకు సిద్ధం అయ్యింది.  ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ అఫర్ అందుబాటులో ఉంటుంది.  ఈరోజు నుంచి నెల రోజులపాటు ఈ అఫర్ అందుబాటులో ఉంటుందని యాజమాన్యం ప్రకటించింది.  గత యాభై ఏళ్లుగా పెట్రోల్ వ్యాపారంలో ఉన్నామని, కర్ణాటకలో అత్యధిక ఇంధనం అమ్మిన ఘనత తమకే దక్కిందని యాజమాన్యం పేర్కొన్నది.  వినియోగదారులకు కృతజ్ఞతలు తెలిపేందుకే ఈ అఫర్ ప్రకటించింది.  అయితే, రెండు వేలరూపాయల పెట్రోల్ ను కొనుగోలు చేసిన వారికి మాత్రమే బిర్యానీ అఫర్ వర్తిస్తుంది.  ఇక రూ.250 కి పెట్రోల్ కొనుగోలు చేసిన వారికి ప్రత్యేకమైన ప్రోత్సాహక బహుమతులు అందజేస్తున్నట్టు యాజమాన్యం పేర్కొన్నది.