చరిత్ర సృష్టించబోతున్న నాసా మహిళలు..!!

చరిత్ర సృష్టించబోతున్న నాసా మహిళలు..!!

నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సంయుక్తంగా అంతరిక్షంలో ఏర్పాటు చేసిన నాసా అంతరిక్ష కేంద్రంలో ఇప్పటి వరకు 420మంది వ్యోమగాములు స్పేస్ వాక్ చేశారు.  ఈ స్పేస్ వాక్ లో మహిళలు కూడా ఉన్నారు.  అయితే, ప్రతిసారి స్పేస్ వాక్ చేసే సమయంలో తప్పనిసరిగా పురుషులు లీడ్ చేసేవారు.  వారి ఆధ్వర్యంలోనే స్పేస్  వాక్ చేసేవారు.  

అయితే, ఈరోజు కేవలం మహిళలే స్పేస్ వాక్ చేస్తున్నారు.  క్రిస్టినా కోచ్‌, జెస్సికా మెయిర్‌ అనే ఇద్దరు మహిళా వ్యోమగాములే అంతరిక్షంలో నడిచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో తలెత్తిన లోపాల్ని సవరించనున్నారు. పాడైన బ్యాటరీ కంట్రోలర్ల స్థానంలో కొత్తవాటిని అమర్చడానికి స్పేస్‌ వాక్‌ చేయనున్న క్రిస్టినా కోచ్‌, జెస్సికా మెయిర్‌ సరికొత్త చరిత్ర సృష్టించనున్నారు అని నాసా ప్రకటించింది.  ఇదిలా ఉంటె 1965లో రష్యా వ్యోమగామి మొదటిసారిగా స్పేస్ వాక్ చేయగా 1984 లో మొదటి మహిళా స్పేస్ వాక్ చేసింది.  ఇప్పటి వరకు 15 మంది మహిళలు స్పేస్ వాక్ చేయడం విశేషం.