నేడు బల్దియా కౌన్సిల్‌, బడ్జెట్‌పై చర్చ..

నేడు బల్దియా కౌన్సిల్‌, బడ్జెట్‌పై చర్చ..

ఇవాళ బల్దియా కౌన్సిల్ సమావేశం జరగనుంది. న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ అధ్య‌క్షత‌న కౌన్సిల్ సమావేశం జరనుండగా 2019-20 సంత్సరానికి గాను రూ. 6150 కోట్ల బడ్జెట్ ప్రవేశ పెట్ట  కౌన్సిల్లో చర్చిస్తారు. గ‌త డిసెంబ‌ర్ 20వ తేదీన జ‌రిగిన స్టాండింగ్ కమీటీలో బల్దియా బడ్జెట్  ప్రవేశ‌పెట్టారు. ఇక 2019-20 బ‌డ్జెట్ ముసాయిదా వివ‌రాలు ఇలా ఉన్నాయి. 2018-19 ఆమోదిత బ‌డ్జెట్ రూ. 6076.86 కోట్లు, 2018-19 స‌వ‌రించిన బ‌డ్జెట్ మొత్తం రూ. 5375 కోట్లు, 2019-20కు ప్రతిపాదిత బ‌డ్జెట్ మొత్తం రూ. 6150 కోట్లు, మేజ‌ర్ ప్రాజెక్ట్‌ల‌కు ప్రతిపాదిత బ‌డ్జెట్ మొత్తం రూ. 5388 కోట్లు, 2019-20 ప్రతిపాదిత మొత్తం బ‌డ్జెట్ రూ. 11538 కోట్లుగా ఉంది.