గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి తెర..
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో ప్రచారానికి తెరపడింది.. ఇవాళ సాయంత్రం 6 గంటలకు ప్రచారపర్వం ముగిసింది... ఇప్పటి వరకు మాటల మధ్య ఆరోపణలు, విమర్శలకు ఫులిస్టాప్ పడింది.. సవాల్లు, ప్రతిసవాళ్లు, మైకుల హోరు... నినాదాలు జోరుకు బ్రేక్ పడిపోగా... ఇక, సైలెంట్‌గా తమ పని చేసుకోవడంపై ఫోకస్ పెట్టారు అభ్యర్థులు.. ఇప్పటికే పలు ప్రాంతాల్లో డబ్బులు పంచుతూ.. వివిధ పార్టీలకు చెందిన నేతలు పట్టుబడ్డారు. ప్రచార పర్వానికి తెరపడినా... ప్రలోభాల పర్వానికి మాత్రం ఇప్పుడే తెరలేచిందని చెప్పవచ్చు.. పోలింగ్ ఎల్లుండి జరగనుండగా.. రేపు ఒకేరోజు సమయం ఉంది.. దీంతో.. వీలైనంత ఎక్కువమంది ఓటర్లను ఆకట్టుకునే పనిలోపడిపోయారు అభ్యర్థులు.
మరోవైపు.. డిసెంబర్ 1వ తేదీన జరిగే పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు.. గ్రేటర్ పరిధిలో మొత్తం ఓటర్లు 74,67,256గా ఉండగా.. అందులో పురుషులు 38,89,637 మంది ఓటర్లు, స్త్రీలు 30,76,941, ఇతరులు 415గా ఉన్నారు.. మొత్తం 150 వార్డుల బరిలో 1,122 మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని తేల్చుకోనున్నారు... ఇందులో టీఆర్ఎస్ నుంచి 150, బీజేపీ 149, కాంగ్రెస్ 146, టీడీపీ 106, ఎంఐఎం 51, సిపిఐ 17, సిపిఎం 12, రిజిస్టార్డ్ పార్టీల అభ్యర్థులు 76, స్వతంత్రులు 415గా బరిలో ఉన్నారు. ఇక, మొత్తం 36,404 సిబ్బంది పోలింగ్ విధుల్లో పాల్గొననున్నారు.. పోలింగ్ అధికారులు 9101, సహాయ పోలింగ్ అధికారులు 9101, ఇతర పోలింగ్ సిబ్బంది 18,202 మంది విధులు నిర్వహిస్తారు. ఎల్లుండి (డిసెంబర్ 1వ తేదీన) ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది.. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ పూర్తి అవుతుంది... అంటే, సాయంత్రం 6 గంటల లోపు క్యూలైన్లో ఉన్నవారికి ఓటువేసే అవకాశం కల్పిస్తారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)