జీహెచ్‌ఎంసీ ఎన్నికల అభ్యర్థులకు డెడ్‌లైన్.. లేకపోతే వేటే..!

జీహెచ్‌ఎంసీ ఎన్నికల అభ్యర్థులకు డెడ్‌లైన్.. లేకపోతే వేటే..!

ఇటీవలే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలకు ముగిసాయి.. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు ఇంకా ప్రమాణం చేయలేదు.. మేయర్ ఎన్నిక కూడా జరగలేదు.. దానికి మరికొంత సమయం ఉన్నట్టు ప్రభుత్వం చెబుతోంది.. అయితే, జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించిన ఖర్చులను అభ్యర్థులు చాలా మంది ఇంకా సమర్పించలేదు... అయితే, వాళ్లు వెంటనే సమర్పించాలని.. సకాలంలో సమర్పించని పక్షంలో అనర్హతకు గురయ్యే అవకాశం ఉంటుందని హెచ్చరించారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆర్. పార్థసారథి... ఈ నెల 8వ తేదీన ఎన్నికల ఎక్ష్పెండిచర్ అబ్సర్వర్లతో ఎన్నికల ఖర్చులపై సమీక్ష స‌మావేశం నిర్వహించ నున్నట్లు ఆయన వెల్లడించారు.. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు జిహెచ్ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్, జోనల్ కమీషనర్లు, జిహెచ్ఎంసీ ఉన్నతాధికారులు రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ను కలిసారు. ఈ సందర్బంగా రాష్ట్ర ఎన్నికల కమీషనర్ మాట్లాడుతూ.. జిహెచ్ఎంసీ ఎన్నికలలో గెలుపొందిన అభ్యర్థుల జాబితాను గెజిట్ లో ప్రచురించాల్సి ఉన్నందున జాబితాను వెంటనె సమర్పించాల్సిందిగా ఎన్నికల అధికారిని కోరారు. ఇదే సమయంలో.. ఎన్నికలకు సంబంధించిన ఖర్చులను అభ్యర్థులు సకాలంలో సమర్పించని పక్షంలో అనర్హతకు గురయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు.