బల్దియా బాద్‌ షా తేలిపోయింది..! ఎగ్జిట్‌ పోల్స్ ఫలితాలు..

బల్దియా బాద్‌ షా తేలిపోయింది..! ఎగ్జిట్‌ పోల్స్ ఫలితాలు..

గ్రేటర్ ఎన్నికల్లో ముగిసాయి... బ్యాలెట్ బాక్సుల్లో అభ్యర్థుల భవితవ్వం నిక్షిప్తమైఉంది.. రేపు గ్రేటర్ ఎన్నికల ఫలితాలు వెలువడనుండగా... ఇక, బల్దియా బాద్‌ షా ఎవరో తేల్చేశాయి ఎగ్జిట్ పోల్స్... ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. మరోసారి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో టీఆర్ఎస్ జెండా ఎగరనుంది... కానీ, ఈసారి సెంచరీ కొడతామని ఉవ్విళ్లురుతోన్న ఆ పార్టీ ఆశలకు గండి పడే అవకాశాలు ఉన్నాయి... సీట్లు తగ్గినా.. మేయర్ పీఠం మాత్రం ఆ పార్టీ ఖాతాలోకే వెళ్లనుంది.. జీహెచ్‌ఎంసీలో 150 డివిజన్లు ఉండగా.. 52 మంది ఎక్స్‌-అఫిషియో సభ్యులు ఉన్నారు... వీరికి మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం ఉంది.. వీరిలో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే దాదాపు 40 మంది వరకు ఉన్నారు.. దీంతో.. సీట్లు తగ్గినా.. మేయర్ పీఠంపై టీఆర్ఎస్ నేతే కూర్చోవడం పక్కా అంటున్నాయి ఎగ్జిట్ పోల్స్.. మరోవైపు బీజేపీ అనూహ్యంగా తన స్థానాలను పెంచుకోనుండగా... ఎంఐఎం తన పట్టును నిలుపుకోనుంది.. కానీ, కాంగ్రెస్ మాత్రం చతికిలపడడం ఖాయమంటున్నాయి ఎగ్జిట్ పోల్స్.. గ్రేటర్ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఓసారి పరిశీలిస్తే... 

పీపుల్స్ పల్స్: 150 స్థానాలు కలిగిన గ్రేటర్ హైదరాబాద్‌లో టీఆర్ఎస్ పార్టీ 68-78 స్థానాల్లో విజయం సాధించడం ఖాయమని చెబుతోంది.. బీజేపీ 25-35 స్థానాల్లో విజయం సాధించనుండగా... ఎంఐఎం 38-42 సీట్లు సొంతం చేసుకోనుంది... ఇక, కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా తయారైంది.. ఆ పార్టీకి 1-5 స్థానాలు మాత్రమే వచ్చే అవకాశం ఉందని తేల్చింది.. 
ఓటు షేరింగ్ విషయానికి వస్తే టీఆర్ఎస్ పార్టీకి 38 శాతం, బీజేపీకి 32 శాతం, ఎంఐఎంకు 13, కాంగ్రెస్‌కు 12 శాతం, ఇతరులకు 5 శాతంగా ఉంటుందని పీపుల్స్ పల్స్ పేర్కొంది. 

ఆరా సర్వే: మరోసారి గ్రేటర్ పీఠం గులాబీ పార్టీ ఖాతాలో పడనుందని అంచనా వేసింది ఆరా ఎగ్జిట్ పోల్స్... టీఆర్ఎస్  పార్టీ 40.08 శాతం ఓటు షేర్‌తో 78 స్థానాల్లో విజయం సాధించనుడగా.. 31.21 శాతం ఓటు షేరింగ్‌తో బీజేపీ 28 స్థానాలు దక్కించుకోనుంది... ఇక, 8.58 శాతం ఓటు షేరింగ్‌తో కాంగ్రెస్ మూడు స్థానాలు తన ఖాతాలో వేసుకోనుండగా.. ఇతరులకు 7.70 శాతం ఓటింగ్‌ షేర్ ఉన్నా.. ఇతరులకు ఎలాంటి సీట్లు రాబోయని తేల్చింది. 

సీపీఎస్ టీమ్: టీఆర్ఎస్‌కు 82 నుంచి 96 స్థానాలు, బీజేపీకి 12 నుంచి 20 స్థానాలు, కాంగ్రెస్‌కు 3 నుంచి 5 స్థానాలు, ఎంఐఎంకు 32 నుంచి 38 స్థానాలు
హెచ్‌ఎంఆర్: టీఆర్ఎస్ పార్టీకి 65 నుంచి 70 స్థానాలు, బీజేపీకి 27 నుంచి 31 స్థానాలు, ఎంఐఎంకు 35నుంచి 40 స్థానాలు, కాంగ్రెస్ పార్టీకి 3 - 6 స్థానాలు, ఇతరులు 3 స్థానాల్లో విజయం సాధించే అవకాశం