చివరి అంకానికి బల్దియా ఎన్నికలు.. నేటితో ప్రచారానికి తెర

చివరి అంకానికి బల్దియా ఎన్నికలు.. నేటితో ప్రచారానికి తెర

ఇవాళ్టితో జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం ముగియనుంది. సాయంత్రం 5 గంటల కల్లా మైకులు మూగబోనున్నాయి. దీంతో, ప్రధాన పార్టీల మధ్య విమర్శల పర్వం మరింత తీవ్రతరం అయ్యే అవకాశముంది.  టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతలు నగరమంతా కలియదిరుగుతున్నారు. మరోవైపు,  ఎల్లుండి జరగనున్న పోలింగ్‌ కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. డిసెంబర్ 1న పోలింగ్ జరగనుండగా 4న గ్రేటర్ ఫలితాలు వెలువడనున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ పెద్దల ప్రచారంతో పొలిటికల్ హీట్ పెరిగింది. ఇవాళ పాతబస్తీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. అమిత్ షా రాక నేపథ్యంలో పాతబస్తీలో భారీగా కేంద్ర బలగాలను మోహరించారు. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో  ప్రత్యేక పూజలు చేయనున్నారు అమిత్ షా. ఆ తర్వాత అక్కడి నుంచి రోడ్ షో నిర్వహిస్తారు. ఇప్పటికే యూపీ సీఎం యోగి, బీజేపీ చీఫ్ నడ్డాలు గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.