'జీహెచ్‌ఎంసీ'కి ప్రధాని పురస్కారం

'జీహెచ్‌ఎంసీ'కి ప్రధాని పురస్కారం

జీహెచ్‌ఎంసీ అభివృద్ధకిగానూ బాండ్ల రూపంలో నిధులు సేకరించినందుకు నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డిలనకు ప్రధాని మోడీ ప్రోత్సాహకాలు అందజేశారు. యూపీ రాజధాని లక్నోలో ఇవాళ జరిగిన ట్రాన్స్‌ఫార్మింగ్ అర్బన్ ల్యాండ్ స్కేపింగ్ స‌ద‌స్సులో రూ.26 కోట్ల చెక్కును, ప్రశంసాపత్రాన్ని ప్రధాని అందించారు. ఈ కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, హరిదీప్‌సింగ్‌పురి తదితరులు పాల్గొన్నారు.