కేటీఆర్‌ ఫ్లెక్సీలను తొలగించిన మేయర్...

కేటీఆర్‌ ఫ్లెక్సీలను తొలగించిన మేయర్...

హైదరాబాద్‌లో తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ ఫ్లెక్సీలను దగ్గరుండి తొలగించారు మేయర్ బొంతు రామ్మోహన్... అదేంటి? మేయర్... కేటీఆర్‌ ఫ్లెక్సీలను తొలగించడమేంటని ఆశ్చర్యపోతున్నారేమో... ఈ నెల 24వ తేదీన మంత్రి కేటీఆర్ పుట్టినరోజు రానుంది... అయితే తన పుట్టినరోజున పేపర్ యాడ్స్, ఫ్లెక్సీలు, హోర్డింగులు ఏర్పాటు చేయొద్దని మంత్రి కేటీఆర్‌ స్వయంగా విజ్ఞప్తి చేయడంతో... అప్పటికే ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు, పోస్టర్లపై దృష్టిపెట్టారు మేయర్... అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను దగ్గరుండి తొలగించారాయన. ఎవరైనా ఇప్పటికే ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిఉంటే తొలగించాలని అన్ని ప్రాంతీయ టీఆర్ఎస్‌ కార్యాలయాలకు కూడా మంత్రి కేటీఆర్‌ సూచించారు. తన పుట్టిన రోజున యాడ్స్, ఫ్లెక్సీలు, హోర్డింగుల కోసం చేసే ఖర్చును... ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇవ్వాలని కేటీఆర్ కోరిన సంగతి తెలిసిందే.