హైదరాబాద్ మేయర్ ఎంపికకు ఏర్పాట్లు షురూ... 

హైదరాబాద్ మేయర్ ఎంపికకు ఏర్పాట్లు షురూ... 

హైదరాబాద్ జీహెచ్ఎంసి ఎన్నికలకు ఇప్పటికే ముగిసాయి.  గతేడాది డిసెంబర్ లో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే.  ఈ ఎన్నికల్లో ఎవరికీ సరైన మెజారిటీ రాలేదు.  అధికార టిఆర్ఎస్ పార్టీ 56, బీజేపీ 48, మజ్లీస్ 44 సీట్లు గెలుచుకున్నారు.  ఇక ఇదిలా ఉంటె, గెలిచిన కార్పొరేటర్లకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ ను కూడా ప్రభుత్వం రిలీజ్ చేసింది.  ఈ నెల 11 వ తేదీన ఎంపికైన కార్పొరేటర్లు ప్రమాణస్వీకారం చేయాల్సి ఉన్నది.  ప్రమాణస్వీకారం తరువాత అదే రోజున మేయర్, డిప్యూటీ మేయర్ల ఎంపిక ఉంటుంది.  అదే రోజున ప్రమాణస్వీకారం చేసేందుకు కొంతమంది సుముఖంగా లేరు. ఎందుకంటే ఆరోజు అమావాస్య కావడంతో కొందరు ప్రమాణస్వీకారం చేసేందుకు సిద్ధంగా లేమని అంటున్నారు.  ఫిబ్రవరి 11 వ తేదీన మేయర్, డిప్యూటీ మేయర్ల ఎంపికకు సంబంధించిన ఏర్పాట్లను చేస్తున్నారు.  ఈ ఎంపిక ప్రక్రియకు సంబంధించి ప్రిసైడింగ్ అధికారి, హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతి ఈరోజు జీహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్ తో సమావేశం కాబోతున్నారు.  ఏర్పాట్లపై చర్చించబోతున్నారు.