బస్తీల్లో తిరుగుతాం, అవగాహన పెంచుకుంటాం: జీహెచ్ఎంసీ మేయర్

బస్తీల్లో తిరుగుతాం, అవగాహన పెంచుకుంటాం: జీహెచ్ఎంసీ మేయర్

మేయర్, డిప్యూటీ మేయర్ గా అవకాశం ఇవ్వడం తమ అదృష్టం మేయర్ గద్వాల విజయ లక్ష్మి పేర్కొన్నారు.  ఇద్దరు మహిళలకు ఇవ్వడం గర్వకారణమని.. తనకు పేద ప్రజల సమస్యల పట్ల అవగాహన ఉందని తెలిపారు. ప్రజల కోసం బస్తీల్లో తిరుగుతాం, అవగాహన పెంచుకుంటామని స్పష్టం చేశారు. తమ మీద పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయబోమని మేయర్ గద్వాల విజయ లక్ష్మి తెలిపారు.  అనంతరం డిప్యూటీ మేయర్ శ్రీలత మాట్లాడుతూ.. తనకు డిప్యూటీ మేయర్ ఇవ్వడం సంతోషకరమన్నారు. తన భర్త ఉద్యమకారుడని..తనకు డిప్యూటీ మేయర్ ఇవ్వడం ఉద్యమకారులకు దక్కిన గౌరవమని పేర్కొన్నారు.