రూ. 200 ఫైన్ కట్టిన రామ్.. ఎందుకంటే..!!

రూ. 200 ఫైన్ కట్టిన రామ్.. ఎందుకంటే..!!

రామ్ పోతినేని హీరోగా చేస్తున్న ఇస్మార్ట్ శంకర్ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయింది.  ఒకవైపు షూట్ చేస్తూనే మరోవైపు ప్రమోషన్స్ చేస్తున్నారు.  పాతబస్తీ కుర్రాడి కథతో తెరకెక్కిన ఈ సినిమాలో రామ్ చాల ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నారు.  ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.  

ఇదిలా ఉంటె ఈ సినిమా షూటింగ్ సమయంలో పాతబస్తీలో నో స్మోకింగ్ జోన్ లో సిగరెట్ కాలుస్తూ కనిపించాడు.  నో స్మోకింగ్ జోన్ లో సిగరెట్ కాలుస్తున్న రామ్ కు అధికారులు రూ.200 రూపాయలు ఫైన్ వేశారు. ఈ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది.  రామ్ హీరోగా చేస్తున్న ఈ మూవీ జులై 18 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.