జీహెచ్‌ఎంసీ వినూత్న ప్రయోగం...

జీహెచ్‌ఎంసీ వినూత్న ప్రయోగం...
ఎన్నో ప్రయోగాలను ఆచరణలో పెట్టిన జీహెచ్‌ఎంసీ మరో వినూత్న ప్రయోగానికి సిద్దపడింది. అధికారులు, ఉద్యోగులు ఎటువంటి బేదాభిప్రాయాలు లేకుండా అందరూ కలిసిమెలిసి పనిచేయాలని కోరుతూ 'యు ఆర్ ఇంటర్‌డిపెండెంట్' అనే స్టిక్కర్లను ముద్రించారు. వీటన్నింటిని అన్ని కార్యాలయాల్లో అంటించాలని.. ఉద్యోగులంతా ఈ పద్ధతిని పాటించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ కోరారు. జీహెచ్‌ఎంసీలో జూనియర్ ఐఏఎస్ అధికారులను కొత్తగా నియమించింది. వారికి అధిక ప్రాధాన్యమిస్తూ కీలక విభాగాలు అప్పగించడంతో.. సీనియర్ నాన్ ఐఏఎస్ అధికారులు వారికింద పనిచేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వారు కొంత ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో అందరూ సమానులే.. అంతా కలిసిమెలిసి పనిచేయాలని సూచిస్తూ కమిషనర్ ఇలా స్టిక్కర్లను ముద్రించి అన్ని కార్యాలయాల్లో అంటించాలని కోరారు.