ఆమె ఝాన్సీ రాణి కాదు.. 

ఆమె ఝాన్సీ రాణి కాదు.. 

నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో పలువురిపై విరుచుకుపడే కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ తాజాగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై విమర్శలు చేశారు. ఆమెపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఝాన్సీ కా రాణిగా పిలువబడే ఆమె.... ఝాన్సీ రాణి కాదన్నారు. రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని ఆరోపించారు. ఆమెను ఝాన్సీ రాణితో పోల్చటం సరికాదన్నారు. ఝాన్నీ రాణి మనుషులను చంపే వారికి మద్దతుగా నిలవదని ఆయన విమర్శించారు. "మమత ఝాన్సీ రాణి కాదు.. ఆమె పూతన" అని ఘాటుగా వ్యాఖ్యానించారు. కోల్‌కతాలో ఇటీవల సీబీఐ చర్యపై మమతా బెనర్జీ ధర్నాకు దిగడంతో ఆమెను ఆధునిక 'ఝాన్సీ లక్ష్మీభాయ్' అంటూ టీఎంసీ నేతలు అభివర్ణించారు.  ఇండియాను చీల్చే మమతకు ఝాన్సీతో పోలికేంటని ఆయన ప్రశ్నించారు. రోహింగ్యాలు, అక్రమ వలసదారులకు మమత మద్దతిచ్చిన మహిళను ఝాన్సీతో పోల్చడం అంటే ఝాన్సీబాయ్ ని అవమానించడమే అని పేర్కొన్నారు.దేశంలో ప్రజాస్వామ్యానికి తావులేని ఏకైక రాష్ట్రం పశ్చిమ బెంగాల్ అంటూ ఘాటు విమర్శలు చేశారు.