మోదమాంబ ఉత్సవాల్లో అపశ్రుతి

 మోదమాంబ ఉత్సవాల్లో అపశ్రుతి

విశాఖ జిల్లా పాడేరులో జరుగుతున్న మోదమాంబ ఉత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన జెయింట్ వీల్ వద్ద జరిగిన ప్రమాదంలో ఓ బాలిక మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. భవాని అనే బాలిక ఉత్సవాల్లో ఏర్పాటు చేసిన జెయింట్ వీల్ ఎక్కింది. అయితే జెయింట్ వీల్ వేగంగా తిరుగుతున్న క్రమంలో ఒక్కసారిగా ఆమెకు కళ్లు తిరిగాయి. పైనుంచి కింద పడటంతో తలకు గాయాలు అయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు, స్థానికులు బాలికను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ భవాని మంగళవారం మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. కాగా, ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి కూడా గాయాలు అయ్యాయని పోలీసులు తెలిపారు.