దారుణం : చెల్లెలి మీద అన్న రేప్ : సూసైడ్ !

దారుణం : చెల్లెలి మీద అన్న రేప్ : సూసైడ్ !


భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. సొంత అన్నే తాగిన మైకంలో స్నేహితుడితో కలిసి అత్యాచారం చేయడంతో అవమానం తట్టుకోలేక పురుగుల మందు తాగిన ఓ బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. పాల్వంచ జ్యోతి నగర్లోని 17 ఏళ్ల అమ్మాయికి ఇటీవలే పెళ్లి కుదిరింది. అయితే 18 ఏళ్లు దాటాక వచ్చే ఏడాది పెళ్లి చేద్దామని తల్లిదండ్రులు అనుకున్నారు. ఊరికి వెళ్తూ ఆ అమ్మాయిని అన్న ఇంట్లో ఉంచి వెళ్లారు. స్నేహితుడితో కలిసి ఇంట్లోనే మద్యం సేవించిన అన్న మత్తులో బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. స్నేహితుడిని కూడా బాలికపైకి ఉసిగొల్పాడు. ఇద్దరూ అత్యాచారం చేయడంతో అవమానం తట్టుకోలేక ఆ బాలిక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. పరిస్థితి విషమించడంతో కన్నుమూసింది. నమ్మి అమ్మాయిని ఇంట్లో ఉంచి వెళ్తే ఊరి నుంచి తిరిగొచ్చిన తమకు ఆమె మృతదేహాన్ని చూపడంతో బాలిక తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.