టీషర్ట్ పై 'నమో అగైన్'.. యువతిపై దాడి

టీషర్ట్ పై 'నమో అగైన్'.. యువతిపై దాడి

టీషర్ట్ పై 'నమో అగైన్' అని రాసి ఉన్నందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ఓ యువతితో దురుసుగా ప్రవర్తించారు. ఆమెను ప్రియాంకగాంధీ ర్యాలీనుంచి దూరంగా గెంటేశారు. ఈ ఘటన వారణాసిలో బుధవారం జరిగిన ప్రియాంకగాంధీ ర్యాలీలో చోటు చేసుకుంది. అస్సీ ఘాట్‌ వద్ద ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో స్థానిక కాలేజీకి చెందిన ఓ యువతి ‘నమో అగైన్‌’ అని రాసి ఉన్న నీలిరంగు టీ షర్ట్‌ను ధరించి అటుగా నడుచుకుంటూ వెళుతుండగా.. కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆమె చుట్టూ మూగి.. దురుసుగా ప్రవర్తించారు. ‘చౌకీదార్‌ చోర్ హై’ అంటూ నినాదాలు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. దీంతో జోక్యం చేసుకున్న పోలీసులు యువతిని అరెస్టు చేస్తామని కాంగ్రెస్‌ కార్యకర్తలకు నచ్చజెప్పడం వీడియోలో వినొచ్చు. అయితే, తాను బీజేపీ కార్యకర్తను కానని, కేవలం మోడీకి సపోర్టర్‌ను మాత్రమేనని ఆమె చెప్పడం వీడియోలో వినిపిస్తోంది.