చదువుబిడ్డ కష్టాలు..ఆన్లైన్ క్లాసుల కోసం ఇల్లెక్కింది..!

చదువుబిడ్డ కష్టాలు..ఆన్లైన్ క్లాసుల కోసం ఇల్లెక్కింది..!

కరోనా విజృంభణ నేపథ్యంలో కేంద్రం లాక్ డౌన్ ని అమలు చేసింది. లాక్ డౌన్ తో అన్ని విద్యాసంస్థలు మూసివేయాలని ఆదేశాలు జారీచేసింది. దాంతో ప్రైవేట్, ప్రభుత్వ విద్యాసంస్థలన్నీ విద్యార్థులకు ఆన్లైన్ తరగతులను నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంతమంది మొబైల్ ఫోన్ లు, కంప్యూటర్ లు లేక ఇబ్బంది పడుతుంటే మరికొందరు విద్యార్థులు నెట్ వర్క్ సరిగ్గా రాక అవస్థలు పడుతున్నారు. ఈ తరుణంలో కేరళకు చెందిన ఓ విద్యార్ధిని నెట్ వర్క్ కోసం ఏకంగా ఇంటిపైకి ఎక్కి కూర్చుంది. చదువుకోవడం కోసం ఆమె పడుతున్న చూసిన ఓ ఔత్సాహికుడు ఆమె ఫోటోను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. దాంతో ఆ ఫోటో వైరల్ గా మారింది. ఇక ఆన్లైన్ క్లాసులు ఎగ్గొట్టడానికి కొంత మంది విద్యార్థులు ఉపాయాలు వేస్తుంటే కేరళ అమ్మాయి మాత్రం ఇల్లు ఎక్కి మరీ క్లాసులు వింటుండటంతో నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.