దారుణం: ఐస్‌క్రీమ్‌లో మత్తుమందు కలిపి బాలికపై...!

దారుణం: ఐస్‌క్రీమ్‌లో మత్తుమందు కలిపి బాలికపై...!

హైదరాబాద్‌ శివారులోని మీర్‌పేట్‌ పోలీస్‌స్టేషన్‌లో దారుణమైన ఘటన వెలుగు చూసింది. మీర్‌పేట్ పీఎస్ పరిధిలోని ప్రశాంత్‌నగర్‌లో 17 ఏళ్ల బాలికపై కన్నేసిన కామాంధుడు.. ఆ బాలికకు ఐస్‌క్రీమ్‌లో మత్తు మందు కలిపి ఇచ్చి పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్టు తెలుస్తోంది. బాలికకు ఆ వ్యక్తి మామ అవుతాడు.. బాలికపై సవతితల్లి అన్న మల్లేష్‌ అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే, బాలిక గర్భం దాల్చడంతో విషయం బయటకు వచ్చింది. దీంతో, ఈ విషయాన్ని గోప్యంగా ఉంచేందుకు రూ.1.50 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు మల్లేష్. అయితే, విషయం బయటకు రావడంతో బాలికను కొట్టి హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని బాలిక బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, నిందితుడు మల్లేష్ పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. కానీ, ఐస్‌క్రీమ్‌లో మత్తుమందు కలిపి బాలికపై అత్యాచారం చేయడం.. ఆపై హత్య చేశారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.