బర్త్‌డే అంటూ పిలిచి బాలికపై అత్యాచారం...! సహకరించిన తల్లి...!

బర్త్‌డే అంటూ పిలిచి బాలికపై అత్యాచారం...! సహకరించిన తల్లి...!

దేశవ్యాప్తంగా ప్రతీరోజూ ఏదోఒక చోట చిన్నారులు, అమ్మాయిలు, మహిళలు అనే తేడా లేకుండా అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి... ఓవైపు దశ కేసులో నిందితులుగా ఉన్న ఆ నలుగురిని ఎన్‌కౌంటర్‌లో హతమార్చిన మరుసటి రోజే వెలుగుచూసిన ఓ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. విజయవాడలో ఓ బాలికపై యువకుడు అత్యాచారం చేశాడు.. పుట్టినరోజు పేరుతో ఇంటికి తీసుకెళ్లిన యువకుడు... ఆ బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు... ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. బాలికపై అత్యాచారం చేసేందుకు ఆ యువకుడికి అతడి తల్లి సహకరిచింది. వివరాల్లోకి వెళ్తే విద్యాధరపురం ప్రాంతానికి చెందిన సాయి అనే యువకుడు కొన్నాళ్లుగా ఓ బాలికను ప్రేమిస్తున్నానంటూ వేధిస్తున్నాడు.. ఈ నెల 2వ తేదీన మాయమాటలు చెప్పి ఆ బాలికను ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు. బాధితురాలి శుక్రవారం రోజు భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆలస్యంగా ఈ ఘటన వెలుగు చూసింది. దీంతో తల్లీకొడుకులను అరెస్ట్ చేసిన పోలీసులు.. యువకుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.